Crime News: అర్ధరాత్రి వార్డెన్ వికృత చేష్టలు.. బ్లూ ఫిల్మ్ చూపిస్తూ ఏడుగురు విద్యార్థులతో..

by Nagaya |   ( Updated:2022-09-13 13:26:19.0  )
Crime News: అర్ధరాత్రి వార్డెన్ వికృత చేష్టలు.. బ్లూ ఫిల్మ్ చూపిస్తూ ఏడుగురు విద్యార్థులతో..
X

దిశ, వెబ్‌డెస్క్ : తండ్రి స్థానంలో ఉండి సంరక్షించాల్సిన ఓ వార్డెన్ విద్యార్థుల పట్ల కీచకుడిగా మారాడు. అర్ధరాత్రి కామాంధుడిలా మారి అబ్బాయిలకు న్యూడ్ వీడియోలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏడుగురు విద్యార్థులను లైంగికంగా వేధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ వికృత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా చింతూర్ మండలం హల్లిగూడెం గ్రామానికి చెందిన ముర్రం కృష్ణ (35) బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. హయత్ నగర్‌లో ఉంటూ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో బాలుర హాస్టల్ వార్డెన్‌గా చేరాడు. నెల రోజులుగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కృష్ణ.. విద్యార్థులతో చాలా సన్నిహితంగా ఉంటూ.. క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో వారితోనే పడుకుంటూ అశ్లీల వీడియోలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా నెల రోజులుగా లైంగిక వేధింపులను భరించిన విద్యార్థులు జరుగుతున్న ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.

విద్యార్థులు చెప్పేది విని షాక్ తిన్న తల్లిదండ్రులు గత బుధవారం నేరుగా వెళ్లి హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్‌కు వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వార్డెన్ కృష్ణ ప్రతిరోజు రాత్రి బాలురకు న్యూడు వీడియోలు చేపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఏడుగురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వార్డెన్ కృష్ణ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. విచారణ చేపట్టిన పోలీసులు అతడి కోసం గాలించి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు.

Next Story

Most Viewed