- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Waqf Amendement Bill : వక్ఫ్ బిల్లు.. ట్యాంక్ బండ్ పై ముస్లిం సంఘాల భారీ ర్యాలీ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లు(Waqf Amendement Bill)ను దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లు(Waqf Amendement Bill)ను దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్(Hyderabad) ముస్లిం సంఘాలు భారీ ర్యాలీ(Massive Rally) నిర్వహించాయి. ఈ భారీ ర్యాలీ హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగింది. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని భారీ ధర్నా(Protest) నిర్వహించారు. వక్ఫ్ చట్టంతో వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి, వక్ఫ్ ఆస్తులను హిందూ సంఘాలకు కట్టబెట్టడానికి మోడీ కుట్ర చేస్తున్నారని పలు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా... కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.






