- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో నాన్ స్టాప్ వర్షం.. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
హైదరాబాద్(Hyderabad)లో గురువారం ఉదయం కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు(Heavy Rains) పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో గురువారం ఉదయం కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు(Heavy Rains) పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) నెలకొంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. ముఖ్యంగా మియాపూర్, నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ, టీ హబ్ ప్రాంతాల్లో గంటల తరబడి వాహనదారులు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే భారీ వర్షపు నీటితో ట్రాఫిక్ జామ్ అవడమే కాకుండా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ మీద ఓ భారీ వాహనం రోడ్డు మధ్యలో బ్రేక్ డౌన్ కావడంతో ఆ మార్గంలో ఎక్కడికక్కడ వెహికిల్స్ నిలిచిపోయాయి.
సుమారు నాలుగైదు గంటలపాటు శ్రమించి ట్రాఫిక్ ను అదుపులోకి తీసుకు వచ్చారు ట్రాఫిక్ పోలీసులు. అయితే మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉండటంతో, ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని హైడ్రా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.






