Breaking: కేబుల్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 13:08:37  IST  )

హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది..

Breaking: కేబుల్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి(Madhapur Cable Bridge)పై భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) అయింది. దాదాపు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేబుల్ బ్రిడ్జి‌పై నుంచి రోడ్ నెం. 45 వరకూ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్‌లో ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించడం, రోడ్లు చిన్నగా ఉండటంతో తరచూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వర్షం పడితే మరింత నరకంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటం, అప్పుడప్పుడు వర్షం కూడా కురుస్తుండటంతో రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్లు నిలిచిపోతున్నాయని, దీంతో స్లోగా వెళ్లాల్సి వస్తుందని, ఈ మేరకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. జీహెచ్ ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Next Story