Breaking News : పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిన స్కూల్ బస్

by Muthe.Rajitha |

మేడ్చల్(Medchal) జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఘోర ప్రమాదం(Bus Accident) నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Breaking News : పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిన స్కూల్ బస్
X

దిశ, వెబ్ డెస్క్ : మేడ్చల్(Medchal) జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఘోర ప్రమాదం(Bus Accident) నుంచి తృటిలో తప్పించుకున్నారు. జిల్లాలోని బండమాదారం వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పంట పొలాల్లోకి దూసుకు వెళ్ళింది. డ్రైవర్ నిద్రమత్తులో అజాగ్రత్తగా బస్సు నడపడం వలన ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. కాగా విద్యార్థుల హాహాకారాలు విన్న పొలాల్లో పని చేస్తున్న కూలీలు, రోడ్డుపై వాహనదారులు అక్కడికి చేరుకొని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని, డ్రైవర్ పై, పాఠశాల యాజమన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story