చేనేత వృత్తిని కాపాడుకోవాలి

by Sridhar Babu |
చేనేత వృత్తిని కాపాడుకోవాలి
X

దిశ, జూబ్లీహిల్స్ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన చేనేత వృత్తి అతిపురాతనమైనదని, దానిని మనం కాపాడుకోవాలని తెలంగాణ అగ్రికల్చర్​, హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అమీర్​పేట్​ కమ్మ సంఘంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్​టైల్స్​ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పెషల్ ఈవెంట్ ఎక్స్ పో పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత వృత్తులు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అందించేలా కృషి చేస్తామన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత వృత్తి కోసం పాటుపడిన అంజయ్య సలహాలు, సూచనలు తీసుకొని వస్త్ర పరిశ్రమను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామన్నారు. చేనేతకారుల ప్రోత్సాహానికి ముందుకువచ్చిన మినిస్ట్రీ ఆఫ్ టెక్స్​టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి కృషిని అభినందించారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నిష్ణాతులైన చేనేతకారుల సిల్క్ కాటన్ వస్త్రాలు ఎక్స్ పోలో ఉన్నాయని, ఈనెల 15వ తేదీ వరకు ఈ చేనేత ప్రదర్శన వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్​టైల్స్ వీవర్స్ సర్వీస్ సెంటర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ డాక్టర్ అరుణ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో కమ్మ సంఘం ఫౌండర్ సీవీరావు, స్టేట్ హ్యాండ్లూమ్ ఆడిషనల్ డైరెక్టర్ వెంకటేషం, శ్రీజన్ సిల్క్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శివకుమార్, పోచంపల్లి కో ఆపరేటీవ్ బ్యాంక్ ప్రెసిడెంట్ టి.రమేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed