ప్ర‌భుత్వ ఆసుప‌త్రి కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి : ఏఐటీయూసీ

by Ratna Kumari |

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌ని చేస్తున్న కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఏఐటీయూసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ర‌సింహ డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వ ఆసుప‌త్రి కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి : ఏఐటీయూసీ
X

దిశ‌, కార్వాన్ : ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌ని చేస్తున్న కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఏఐటీయూసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ర‌సింహ డిమాండ్ చేశారు. మంగళవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యాలయం ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం 26వేలు, పండగ, జాతీయ, ఆర్జిత సెలవులు, బోనస్ లాంటి చట్టాల అమలు చేయాలన్నారు.


శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరెటీ విధులు నిర్వహించేందుకు మూడు సంవత్సరాల కాలపరిమితికి టెండర్లను పిలిచిన‌ట్టు తెలిపారు. జి.ఓ.నెం. 60 ప్రకారం.. జీతాలు చెల్లించాలని టెండర్ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, గత నాలుగు సంవత్సరాల కాలంలో ఆ జి.ఓ. ప్రకారం.. కార్మికులకు 13,600లు రావాల్సి ఉండగా, కేవలం 11,000వేలు మాత్రమే ఇచ్చార‌ని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల వల్ల వలస కార్మికులకు కనీస వేతనం 26,000వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Next Story