- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయానికి టెండర్ ప్రక్రియ
హస్తినాపురం డివిజన్ పరిధిలోని దేవకమ్మ తోట సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ భూమిలో హస్తినాపురం, బైరామల్ గూడ డివిజన్ వార్డు కార్యాలయాలతో పాటు ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం కూడా నిర్మించనున్నట్టు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ తెలిపారు.

దిశ, హస్తినాపురం : హస్తినాపురం డివిజన్ పరిధిలోని దేవకమ్మ తోట సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ భూమిలో హస్తినాపురం, బైరామల్ గూడ డివిజన్ వార్డు కార్యాలయాలతో పాటు ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం కూడా నిర్మించనున్నట్టు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ తెలిపారు. హస్తినాపురం డివిజన్ లో ఆయన కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ తో కలిసి పర్యటించారు. త్వరలోనే నిధులను మంజూరు చేసి ఈ మూడు కార్యాలయాల భవనాలు నిర్మించనున్నట్టు తెలిపారు. కార్పొరేటర్ సుజాత నాయక్ మాట్లాడుతూ త్వరలోనే టెండర్ ప్రక్రియ నిధులను విడుదల చేసి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్తీక్, సీనియర్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, యాదయ్య, నరసింహ, సతీష్ గౌడ్, జనార్ధన్ పాల్గొన్నారు.






