గాంధీ తర్వాత కేసీఆరే మహాత్ముడు: Upendhra

by Dishanational1 |
గాంధీ తర్వాత కేసీఆరే మహాత్ముడు: Upendhra
X

దిశ, ఎల్బీనగర్: దేశం అభివృద్ధి కావాలంటే మొదలు గ్రామాలు అభివృద్ధి చెందినట్లయితే దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ అన్నారనీ.. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని, మహాత్మా గాంధీ తర్వాత సీఎం కేసీఆరే మహాత్ముడు అని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు గ్రామీణ వాతావరణంలో ఉంటారని గుర్తించారన్నారు. కాబట్టి మెజార్టీ ప్రజల యొక్క వృత్తి వ్యవసాయం కాబట్టి ఆ వ్యవసాయం మీద ఆధారపడ్డ కులాలు అన్ని బాగుపడాలని మొట్టమొదటిగా రైతులను ఆదుకోవడానికి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. రైతుబంధు, రైతు భీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి పంటకు గిట్టుబాటు ధరలు నాణ్యమైన ఎరువులు ఇచ్చి రైతుల్ని ఆదుకోవడం ద్వారా ప్రస్తుతం గ్రామీణ తెలంగాణ ఆకుపచ్చని తెలంగాణగా మారిపోయిందన్నారు.

భారతదేశంలోనే పంట ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి రావడం అనేది సీఎం కేసీఆర్ ధార్శనికతకు నిదర్శనం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యాదవ సోదరులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం వారికి ఉచిత గొర్రె పిల్లల పంపిణీ, మత్స్యకారులను అభివృద్ధి చేయడం కోసం చెరువులలో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల చదువు కోసం వెయ్యికి పైగా గురుకుల పాఠశాల నిర్మించి ఒక్కొక్క విద్యార్థిపై రూ. లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందిస్తూ పేద వర్గాల ప్రజలకు అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కులాలకు, ఎస్టీలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మించి ఇస్తున్నారని, ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, సంక్షేమము, అభివృద్ధి అనే ఎజెండాతో భారతదేశంలో అనేక రంగాలలో నెంబర్ వన్ స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం అంటే అది కేసీఆర్ కృషి ఫలితమే అని కొనియాడారు.


Next Story

Most Viewed