దక్షిణ మధ్య రైల్వేలో ‘సండే ఆన్ సైకిల్’

by Elthuri vijay kumar |

ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు దక్షిణ మధ్య రైల్వే "సండే ఆన్ సైకిల్" కార్యక్రమాన్ని ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ లో నిర్వహించింది

దక్షిణ మధ్య రైల్వేలో ‘సండే ఆన్ సైకిల్’
X

దక్షిణ మధ్య రైల్వేలో ‘సండే ఆన్ సైకిల్’

- “ఫిట్‌నెస్ కా డోస్, ఆధా ఘంటా రోజ్” అనే థీమ్‌తో..

- జెండా ఊపి ప్రారంభించిన డీఆర్ఎం సంతోష్ కుమార్

దిశ, సికింద్రాబాద్: ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు దక్షిణ మధ్య రైల్వే "సండే ఆన్ సైకిల్" కార్యక్రమాన్ని ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ లో నిర్వహించింది. “ఫిట్‌నెస్ కా డోస్, ఆధ ఘంటా రోజ్” అనే థీమ్‌తో జరిగిన ఈ సైక్లింగ్ ర్యాలీకి డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) సంతోష్ కుమార్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా అధికారులతో కలిసి సైకిల్ తొక్కారు.

ఖేలో ఇండియా–ఫిట్ ఇండియా పథకాలలో భాగంగా రైల్వే కార్మిక వర్గంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మ మాట్లాడుతూ, “సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పర్యావరణానికి కూడా అనుకూలం. ప్రతి రైల్వే ఉద్యోగి రోజువారీ జీవితంలో ఫిట్‌నెస్ అలవాటు చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు. సైక్లింగ్ ర్యాలీలో క్రీడాకారులు, అధికారులు, ఉద్యోగులు సహా సుమారు 150 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం సంతోష్ కుమార్ వర్మతో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఓఎస్డీ పి. కోటేశ్వర్ రావు పాల్గొన్నారు.

Next Story