విద్యార్థుల ట్యూషన్ ఫీజులను వెంటనే విడుదల చేయాలి

by Disha Web Desk 15 |
విద్యార్థుల ట్యూషన్ ఫీజులను వెంటనే విడుదల చేయాలి
X

దిశ,కార్వాన్ : ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనార్టీ , ఈ బీసీ, విద్యార్థుల ట్యూషన్ ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు కళాశాలల జేఏసీ కన్వీనర్ గౌరీ సతీష్ అన్నారు. బుధవారం నాంపల్లి లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ లక్షల మందిని విద్యావంతులుగా తీర్చి దిద్దుతున్న విద్యా సంస్థలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయని ,ప్రైవేట్ విద్యా సంస్థలలో పని చేస్తున్న అధ్యాపకులు సమయానికి వేతనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

విద్యార్థుల చదువు అయిపోయి 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి ట్యూషన్ ఫీజ్ నిధులు అందక యాజమాన్యాలు నానా అవస్థలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది విద్యార్థులకు 360 కోట్లు మాత్రమే చెల్లించిందని, కానీ 650 నుంచి 700 కోట్ల వరకు అవుతుందని వీటిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రభుత్వం జూన్ రెండో తేదీలోపు చెల్లించని ఎడల 33 జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో మెమోరాండం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి. రమణారెడ్డి (జేఏసీ చైర్మన్), బాలకృష్ణారెడ్డి ,మధుసూదన్ రెడ్డి, సిద్దేశ్వర చంద్రయ్య గౌడ్, ఇంద్రసేనారెడ్డి, మల్లేశం, శంకర్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed