విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్య‌ను అభ్య‌సించాలి

by Ratna Kumari |

విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని ఓయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య కుమార్ మొలుగం అన్నారు.

విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్య‌ను అభ్య‌సించాలి
X

దిశ, రాంనగర్ : విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని ఓయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య కుమార్ మొలుగం అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో శనివారం స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల14వ పట్టా ప్రధానోత్సవం గ్రాడ్యుయెషన్ డే ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ (యుజి, పీజీ) పూర్తిచేసిన విద్యార్థినీలకు పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేలా నైపుణ్యాన్ని అనువహించాలని, ప్రతి ఒక్కరూ జీవిత పర్యంతం విద్యార్థి లాగానే ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి బాధ్యతను ఎంతో నిబద్ధతతో చొరవ తీసుకోవాలన్నారు.


సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వైఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ టెక్నాలజీ అనేది సమాజం యొక్క అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. దేశం యొక్క అభివృద్ధి, ఆ దేశంలోని సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి పైన ముడిపడి ఉంటుందన్నారు. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ పరీక్షల విభాగాధిపతి ప్రొఫెసర్ కె. శశికాంత్, యునైటెడ్ వే ఇండియా బీసీ ఫండ్ ఇన్వెస్టర్, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ కిరణ్మయి దత్ పెండ్యాల, మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రిసెండింగ్ బిషప్ ఎ. సైమన్, జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ డాక్టర్ కే. వెంకటేశ్వర్ రావు, కళాశాల సెక్రెటరీ కరెస్పాండెంట్ కే. కృష్ణారావు, మేనేజ్ మెంట్ సభ్యులు టి. రాకేష్ రెడ్డి, ఆర్. ప్రదీప్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ బీఎల్ రాజు, డీన్ అకాడమీ ప్రొఫెసర్ ఎ. వినయ్ బాబు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బీవి రమణ మూర్తి, రేడియేషన్ డే కో-ఆర్డినేటర్ గ్రాడ్యుయేషన్ డే కో- ఆర్డినేటర్ ప్రగతి డాక్టర్ వైవిఎస్ఎస్ ప్రగతి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆకుల రమేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story