- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC: వేలకు వేలు ఫైన్స్ వేస్తున్నారు.. జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద వీధి వ్యాపారుల ఆందోళన
మాకు వచ్చే ఆదాయం అంతంతే ఉంటే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం వేలకు వేలు ఫైన్‌లు వేస్తున్నారని నగరంలోని వీధి వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాకు వచ్చే ఆదాయం అంతంతే ఉంటే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Traffic police) మాత్రం వేలకు వేలు ఫైన్‌లు వేస్తున్నారని నగరంలోని వీధి వ్యాపారులు (Street vendors) ఆరోపిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో వీధి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. నిత్యం ట్రాఫిక్ పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తూ చలాన్లు విధిస్తూ షాపులు తొలగిస్తున్నారని వీధి వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు పని చేసుకుంటే రూ. 500, రూ.1000 రూపాయలు వచ్చే షాపులకు వేలకు వేలు ఫైన్లు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వారు మండిపడ్డారు. ఇంకా తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదేని, ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని వారు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని వారు జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.






