SriTeja Health Bulletin : శ్రీతేజ హెల్త్ బులిటెన్ విడుదల

by Muthe.Rajitha |

పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

SriTeja Health Bulletin : శ్రీతేజ హెల్త్ బులిటెన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) తీవ్ర గాయాలపాలై కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. క్రమంగా కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ సాయం లేకుండానే ఆక్సిజన్ తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఫీడింగ్ సక్రమంగా ఉందని, న్యూరాలజీ కండిషన్ కూడా స్థిరంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి శ్రీతేజ కోమాలోకి వెళ్ళగా.. క్రమంగా కోలుకుంటున్నాడు.

Next Story