డీలిమిటేషన్ ఎఫెక్ట్.. పెరిగిన వార్డులు.. తగ్గిన సిబ్బంది !

by velandi.Saikiran |

మల్కాజ్​ గిరి మున్సిపల్​ కార్పొరేషన్​.. ఎల్బీనగర్​ జోన్​.. హయత్​ నగర్​, నాగోల్​ సర్కిళ్లలో అధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది.

డీలిమిటేషన్ ఎఫెక్ట్.. పెరిగిన వార్డులు.. తగ్గిన సిబ్బంది !
X

పెరిగిన వార్డులు.. తగ్గిన సిబ్బంది

- డీలిమిటేషన్ ఎఫెక్ట్

- హయత్​ నగర్​, నాగోల్​ సర్కిళ్లలో పాలన అస్తవ్యస్తం

– టౌన్​ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో అంతా గందరగోళం

- సిబ్బంది లేరన్న సాకుతో చేతులెత్తేస్తున్న అధికారులు

– అడ్డూ అదుపు లేకుండా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు

– చెరువులను కమ్మేసిన గుర్రపు డెక్క.. దోమల దండయాత్ర

– నెలల తరబడి ఎక్కడికక్కడే పేరుకుపోతున్న సమస్యలు

మల్కాజ్​ గిరి మున్సిపల్​ కార్పొరేషన్​.. ఎల్బీనగర్​ జోన్​.. హయత్​ నగర్​, నాగోల్​ సర్కిళ్లలో అధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఓ వైపు జీహెచ్​ఎంసీ డీలిమిటేషన్​ లో ‘పెద్ద అంబర్ ​పేట’ తో నాగోల్​ కొత్త సర్కిల్​ ఏర్పడడం.. మరో వైపు రెండు సర్కిళ్ల నిర్వహణకు సరిపోను అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా టౌన్ ​ప్లానింగ్​, శానిటేషన్​ విభాగాల్లో సమస్య లతో పాటు.. అక్రమ నిర్మాణా లు పెరిగిపోతున్నాయి.

దిశ, వనస్థలిపురం: టౌన్ ​ప్లానింగ్​ విభాగంలో గుర్తించి న అక్రమ నిర్మాణాలకు నోటీసులివ్వాలన్నా.. చర్యలు తీసుకోవాలన్నా ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాగోల్​ కొత్త స ర్కిల్‌​లోని ఆయా వార్డుల్లో చెత్తకుప్పలు రోజుల తరబడి ఎత్తకపోవడం తో గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో సోమవారం హయత్​ నగర్​, నాగోల్​ సర్కిళ్ల పరిధిలోని ఆయా డివిజన్ల తాజా మాజీ కార్పొరేటర్లు జోనల్​ ఆఫీస్​‌లో జరిగిన ప్రజావాణిలో అధికారుల తీరుపై ఫైర్​ అ య్యారు. ఆయా డివిజన్లలోని చెరువులలో గుర్రపుడెక్క, పార్కు స్థలాల కబ్జా, అస్తవ్యస్తంగా మారిన రోడ్ల దుస్థితి సమస్యలను జోనల్​ కమిషనర్‌​కు వినతి పత్రాలు ఇచ్చారు.

టౌన్​ ప్లానింగ్​ అంతా గందరగోళం..

టౌన్​ప్లానింగ్​ విభాగంలో గతంలో హయత్​నగర్​ సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లకు ఇద్దరు టీపీఎస్‌లు, ఒక్కో డివిజన్‌కు ఇద్దరు చైన్ మెన్లు, డిమాలిషన్ టీం, డిమాలిషన్ వెహికల్స్​, కూల్చివేతల కోసం స్పెషల్​ వర్కర్లు పనిచేసేవారు. కానీ ప్రస్తుతం హయ త్​నగర్​ సర్కిల్‌కు ఏసీపీ విజయలక్ష్మితో పాటు టీపీఎస్ ఒక్కరే ఉన్నా రు. హయత్​నగర్​, నాగోల్​ లాంటి సర్కిళ్లలో టౌన్​ప్లానింగ్​ అధికారు లు, సిబ్బంది కొరతతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమనిర్మాణాలకు కనీసం నోటీసులు ఇచ్చే వారు కూడా కరువయ్యారు.

పారిశుధ్యం పరిస్థితి అదే..

రెండు సర్కిళ్లలో పారిశుధ్యం కూడా అధ్వానంగా తయారైంది. ఫలితం గా కాలనీలన్నీ చెత్తకుప్పలుగా మా రుతుంటే, మురుగునీరు రోడ్లపై పా రుతోంది. వీధిదీపాల నిర్వహణను కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సాక్షాత్తు హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పక్కనే ఉన్న కాలనీలో వీధిలైట్లు కొంతకాలంగా వెలగడం లేదు. ఎన్నిసార్లు విన్నవించినా శా శ్వత పరిష్కారం చూపడం లేదు.

చెరువును కమ్మేస్తున్న గుర్రపు డెక్క..

మన్సూరాబాద్​ పెద్ద చెరువు, నాగో ల్​ చెరువు, హయత్​నగర్​ కుమ్మరికుంట చెరువులో గుర్రపుడెక్క కమ్మే సింది. దీంతో రెండు సర్కిళ్ల పరిధి లో దోమల బెడద తీవ్రస్థాయికి చే రింది. పారిశుధ్య లోపం, దోమల విజృంభనతో డెంగీ, మలేరియా, టై ఫాయిడ్‌ కేసులతో ఆసుపత్రులు నిం డుతున్నాయి. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story