Hyderabad : నాంపల్లిలో దారుణం.. తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) లో దారుణ ఘటన వెలుగు చూసింది.

Hyderabad : నాంపల్లిలో దారుణం.. తాళం వేసి ఉన్న ఇంట్లో అస్థిపంజరం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో దారుణ ఘటన వెలుగు చూసింది. నాంపల్లి మార్కెట్ ఏరియాలోని ఓ ఇంట్లో అస్థిపంజరం(Skeleton) బయట పడటం కలకలం రేపింది. అయితే ఆదే కాలనీలో క్రికెట్ ఆడుకుంటున్న ఓ బాలుడు బాల్ కోసం ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లి, తెరిచి ఉన్న కిటికీలో నుంచి తొంగి చూడగా.. అక్కడ ఓ అస్థిపంజరం పది ఉండటంతో షాక్ గురయ్యాడు. తోటి మిత్రులతో కలిసి ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అదికాస్త వైరల్ అయింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఆస్థి పంజరం గురించి సమాచారం సేకరించారు. ఆ స్కెలటన్ అమీర్ ఖాన్ అనే వ్యక్తిది కాగా.. ఆ ఇంటి ఓనర్ మాత్రం చాలా ఏళ్ల క్రితమే విదేశాలకు వెళ్ళిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే అమీర్ కరోనా సమయంలోనే చనిపోయినట్టు పోలీసులు భావిస్తుండగా.. ఇన్నాళ్లుగా ఆ ఇంటి గురించి, అందులో వ్యక్తుల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం.

Next Story