- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిబ్బందినైనా ఇవ్వండి.. విలీనమైనా చేయండి
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో వరదలు నివారించడానికి ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం

సిబ్బందినైనా ఇవ్వండి.. విలీనమైనా చేయండి
ఎస్ఎన్డీపీ విభాగంలో డీఈఈ, ఏఈఈల కొరత
విభాగాన్ని బలోపేతం చేయాలని కమిషనర్‌కు సీఈ విన్నపం
దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో వరదలు నివారించడానికి ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. నాలాలు, వరద నీటికాలువు, చెరువులకు లింకు, నాలాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సర్వే వంటి పర్యవేక్షణకు ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ విభాగానికి తగినంత సిబ్బంది కావాలని కమిషనర్ కర్ణన్‌ను కోరినట్టు సమాచారం.
విభాగం ఇలా..
ఎస్ఎన్డీపీ విభాగానికి ఒక చీఫ్ ఇంజినీర్(సీఈ), సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) ఉన్నారు. మూడు డివిజన్లకుగాను ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ) ఉండాలి. కానీ ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. దీంతోపాటు ఒక్కో ఈఈ పరిధిలో కనీసం ఇద్దరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ), నలుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)లు ఉండాలని సీనియర్ అధికారులు చెబుతున్నారు. కానీ సగం మాత్రమే ఉన్నారు. ఎస్ఎన్డీపీ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు ఎక్కువగా ఉండడంతోపాటు విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో సమయమంతా ట్రావెలింగ్‌కే సరిపోతుందని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.
సిబ్బందిని ఇవ్వండి
గ్రేటర్‌లో 2020లో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా నగరమంతా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో వరదల నివారణ, నాలాల అభివృద్ధి, గొలుసుకట్టు చెరువుల అనుసంధానం వంటి పనుల కోసం ఎస్ఎన్డీపీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో సుమారు రూ.1000 కోట్ల పనులు, రెండో దశలో రూ.600 కోట్ల పనులు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న సిబ్బందితో పనిచేయడం కష్టంగా మారడంతో కొత్తగా సిబ్బందిని కేటాయించాలని కమిషనర్ కర్ణన్‌ను కోరినట్టు తెలిసింది. సిబ్బందిని ఇవ్వడం సాధ్యం కాకపోతే ఎస్ఎన్డీపీ విభాగాన్ని ప్రాజెక్టు విభాగంలో విలీనం చేయాలని సూచించినట్టు తెలిసింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కమిషనర్ బిజీగా ఉండడంతో ఈ సమస్యపై దృష్టి సారించలేకపోయారు. రెండు రోజుల్లో ఎన్నికల బిజీ పూర్తికానుంది. వారంలో రోజుల్లో సిబ్బంది కేటాయింపు, ఎస్ఎన్డీపీ పనులు, హెచ్-సిటీ ప్రాజెక్టు పనులపై ఫోకస్ పెట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.






