Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport)లో ప్రయాణికుల ఆకస్మికంగా ఆందోళనకు దిగారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport)లో ప్రయాణికుల ఆకస్మికంగా ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) నుంచి ప్రయాగ్ రాజ్‌ (Prayagraj)కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం (Spice Jet Flight) సాంకేతిక లోపంతో రావాల్సిన సమయం కంటే 3 గంటలు ఆలస్యంగా వచ్చింది. ఈ క్రమంలోనే ప్రయాగ్ రాజ్ (Prayagraj) వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో తిండితిప్పలు లేకుండా పడిగాపులుకాశారు. ఈ క్రమంలోనే వారంతా ఆగ్రహంతో స్పైస్ జెట్ (Spice Jet) సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫ్లైట్‌లో ఏదైలో సమస్య వస్తే ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఫైర్ అయ్యారు. అలా కాకుండా తీరా ఎయిర్‌పోర్టు (Airport)కు వచ్చాక ఇలా గంటల తరబడి వెయిట్ చేయించడం ఏంటని స్పైస్ జెట్ యాజమాన్యంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే మహా శివరాత్రి (Maha Shivratri) రోజున మహా కుంభమేళ ముగుస్తుండటంతో అసలు రాత్రిలోగా అక్కడి చేరుకుంటామా లేదా అనే టెన్షన్ వారిలో కనిపించింది. ప్రస్తుతం స్పైస్ జెట్ సిబ్బందితో ప్రయాణికులు గొడవకు దిగిన విజువల్స్ సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ వేదికగా కొనసాగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఇవాళ్టితో ముగియనుంది. ఈ క్రమంలోనే మహా శివరాత్రి పర్వదినాన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు రోడ్డు మార్గాలు, ట్రైన్లు, ఫ్లైట్లలో ప్రయాగ్ రాజ్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్య పౌర్ణమి జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా నేటి మహా శివరాత్రి ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఇప్పటి వరకు దాదాపు 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా యూపీ సర్కార్ పేర్కొంది.

Next Story