- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలకులు ముస్లింల చరిత్రను విస్మరించారు : MP Asaduddin Owaisi
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు కూడా ప్రధాన పాత్ర పోషించారని అయితే ప్రస్తుత కేంద్ర పాలకులు మాత్రం ఈ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

దిశ, హిమాయత్‌నగర్ : దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు కూడా ప్రధాన పాత్ర పోషించారని అయితే ప్రస్తుత కేంద్ర పాలకులు మాత్రం ఈ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసర్చ్ ఆధ్వర్యంలో ఆన్ వెఫ్ట్ అండ్ ఆన్ సంగ్ హీరోస్ ఆఫ్ తెలంగాణపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ
చెందిన ఎంతో మంది ముస్లింలు ఆంగ్లేయులపై పోరాటం చేశారని వారి పేర్లు చరిత్రలో కనిపించడం లేదన్నారు. 10 ఏళ్ల పోరాటం చేసిన ఒక సమరయోధుని ఫోటో ప్రధాని కార్యాలయంలో పెట్టారని, 30 ఏళ్లపాటు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అండమాన్ జైలులో శిక్ష అనుభవించిన హైదరాబాద్ కు చెందిన మాలియా అల్లాఉద్దీన్ ఫోటో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. గాంధీ నేతాజీలతో ఎంతో మంది ముస్లింలు కలిసి నడిచారని, నేతాజీకి అన్ని విధాలుగా అండగా ఉండి ఇండియన్ నేషనల్ ఆర్మీలో కీలక పాత్ర పోషించి జై హింద్ అన్న నినాదం ఇచ్చిన అబిద్ హాసన్ సత్రాని హైదరాబాద్ కు చెందిన వ్యక్తేనని గుర్తు చేశారు. మతాలకు సంబంధం లేకుండా స్వాతంత్రం పోరాటం సాగిందని, ముస్లింలను నేటి సమాజం శత్రువుగా చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం నవాబ్ లతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో హైదరాబాదీల భాగస్వామ్యం చాలా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న హైదరాబాదీల పేర్లు చరిత్రలో లేవని అన్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత చిదాఖాన్ సిపాయిలతో కలిసి హైదరాబాద్ కు వచ్చారని ఆయనను అరెస్టు చేసి రెసిడెన్సీలో బందించారని తెలిపారు. ఆయనను విడుదల చేయాలని మార్వీ అల్లాఉద్దీన్, తుర్బ్ ఖాన్ లు పోరాటం చేశారని గుర్తు చేశారు. నేతాజీకి ముఖ్య అనుచరుడు హబీబ్ హాసన్ సత్రాని హైదరాబాద్ లోని గ్రామర్ స్కూల్లో చదివారని, చరిత్రను తిరిగి రచించి భావితరాలకు ఒక మంచి చరిత్రను అందించాల్సిన అవసరం ఆయన ఉందన్నారు. కార్యక్రమంలో ఎల్.పాండురంగా రెడ్డి, ఆలిండియా తామీర్ ఇ-మిలాద్ అధ్యక్షుడు జియాఉద్దీన్ నాయక్, వివేక్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- Asaduddin Owaisi






