- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాల తనిఖీల్లో రూ.31 లక్షలు నగదు స్వాధీనం
ఎన్నికల కోడు అమల్లోకి రావడంతో ఎల్బీనగర్ డీసీపీ పరిధిలో సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకు పలు పోలీస్ స్టేషన్లో వాహనాలను తనిఖీ చేయగా సుమారు 31 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు.

దిశ, ఎల్బీనగర్ : ఎన్నికల కోడు అమల్లోకి రావడంతో ఎల్బీనగర్ డీసీపీ పరిధిలో సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకు పలు పోలీస్ స్టేషన్లో వాహనాలను తనిఖీ చేయగా సుమారు 31 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు. మంగళవారం డీసీపీ మాట్లాడుతూ ఎల్బీనగర్ ఎస్ఓటీ చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్ రాజధాని థియేటర్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అలంపల్లి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై 25 లక్షల రూపాయలు తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించగా అందులో డబ్బులు ఉన్నాయని, వాటికి ఎలాంటి రసీదులు లేకపోవడంతో నగదును స్వాధీన చేసుకున్నట్టు తెలిపారు. అలాగే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోనగర్లో వనస్థలిపురం సీఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా సామ భరత్ రెడ్డి కి చెందిన కారులో 5 లక్షల పదహారు వేల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీటిని ఈదులకంటి జంగయ్య గౌడ్ తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్నామని ఆమె పేర్కొన్నారు.






