పట్టపగలే రౌడీల దౌర్జన్యం!!

by Thanuru Gopichand |

సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​కు కూతవేటు దూరంలోనే పట్టపగలు రౌడీ మూకలు బరితెగించాయి.

పట్టపగలే రౌడీల దౌర్జన్యం!!
X

దిశ, కూకట్​పల్లి: సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​కు కూతవేటు దూరంలోనే పట్టపగలు రౌడీ మూకలు బరితెగించాయి. సుమారు రూ. 50 కోట్లు విలువైన 12 గుంటల ప్రైవేట్ భూమిని 40 మంది రౌడీలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమ భూమిని కాపాడమని పోలీసులను వేడుకుంటే తాము ఏం చేయలేము, పైస్థాయి అధికారులను వెళ్లి కలవమని అల్లాపూర్​ పోలీసులు సమాధానం ఇచ్చారని బాధితులు ఆరోపించారు. పగలే బుల్డోజర్​తో భూమిని చదును చేస్తున్నా, ఫెన్సింగ్​ కూలగొడుతున్నా అల్లా పూర్​ పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండి రౌడీ మూకలకు అడ్డు చెప్పలేకపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దౌర్జన్యానికి వచ్చిన వ్యక్తి సంతోష్​ గౌడ్​ తనను తాను కాంగ్రెస్​ నాయకుడు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్​ సోదరుడిగా చెప్పుకొని భూకబ్జా చేసేందుకు యత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

సర్వే నం.​ 1002 ఎవరిది​..

కూకట్​పల్లి మండలం, కూకట్​పల్లి గ్రామం పరిధి సర్వే నం. 1002లో 2014‌‌–15 రెవెన్యు రికార్డుల ప్రకారం మొత్తం 3.35 ఎకరాల భూమి ఇంటివెంక లక్ష్మయ్య, ఇంటివెంక నరసింహ, ఇంటివెంక యాదయ్య, ఇంటి వెంక రాములు నలుగురు అన్నదమ్ములకు చెందిన భూమి. 3.35 ఎకరాల భూమిని ఎన్​వీఎన్​ కన్ స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్​ కంపెనీ కొనుగోలు చేసింది. అందులో నుంచి 2.38 ఎకరాల భూమి విష్ణు విస్టారా అపార్ట్​మెంట్ల నిర్మాణానికి డెవలప్​మెంట్​కు ఇచ్చారు. మిగిలిన భూమి నుంచి 25 గుంటలు 100 ఫీట్ల రోడ్డులో పోగా మిగిలిన 12 గుంటల భూమి రోడ్డు మరో వైపు మిగిలి ఉంది. ఇదిలా ఉండగా ఎన్​వీఎన్​ కన్ స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్​ కంపెనీ నుంచి 12 గుంటల భూమిని కటికనేని హ రిత 2023లో ఇండియన్​ ఆయిల్​ పెట్రోల్​ బంక్​ ఏర్పాటు చేయడానికి లీజ్​ రూపంలో భూమిని తీసుకున్నారు. ఇదిలా ఉండగా బంక్​ నిర్మాణం కోసం 15వ తేదీ హరిత కుటుంబ సభ్యులు స్థలంలో బోర్​ వేసేందుకు ప్రయత్నించగా కొంత మంది వచ్చి సదరు భూమి తమది ఇది సర్వే నం.​ 1007కు చెందిన భూమి అంటూ పనులు నిలిపి వేయాలంటు దౌర్జన్యానికి దిగారు. మా అన్న సంతోష్​ గౌడ్​ పంపించాడు, ఇక్కడ ఎటువంటి పనులు చేపట్టవద్దంటూ బెదిరించారు. దీంతో హరిత కుటుంబ సభ్యులు అల్లాపూర్​ పోలీసులను ఆశ్రయించగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇరువురిని పత్రాలు తీసుకుని రావలని చెప్పి వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం 40 మంది రౌడీలు, పలు కార్లలో అక్కడికి వచ్చి బుల్డోజర్​ సాయంతో హరిత లీజుకు తీసుకున్న 12 గుంటల భూమిలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్​ని తొలగించారు. పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడికి చేరుకున్న అల్లాపూర్​ సీఐ కూడా రౌడీ మూకలు పనులు చేయకుండా ఆపలేదని, ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పుకోండంటూ ఉచిత సలహా ఇచ్చారని హరిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసులపై ఆరోపణలు

సైబరాబాద్​ కమిషనరేట్​ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూమిలో పట్ట పగలే రౌడీలు చెలరేగిపోతుంటే అడ్డుకోవలసిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితుల గోడు వినకుండా పైస్థాయి నుంచి ఒత్తిడి ఉంది, మీరు ఉన్నతాధికారులను కలిసి బాధ చెప్పుకోవాలని పోలీసులు బాధితులకు ఉచిత సలహా ఇచ్చారని బాధితులు ఆరోపిస్తుండడాన్ని ఎలా చూడాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అన్ని శాఖల నుంచి అనుమతులు పొందాం

ఎన్​వీఎన్​ కన్ స్ట్రక్చన్ కంపెనీ నుంచి ప్రెట్రోల్​ బంకు కోసం డాక్యుమెంట్​ నం.​ 6912/2023 ద్వారా లీజ్​ డీడ్​ చేయించుకొని 12 గుంటల భూమిని తీసుకున్నాం. పోలీస్, ఇరిగేషన్​, కలెక్టర్​ అన్ని శాఖల నుంచి అన్ని అనుమతులు, క్లియరెన్స్​ తీసుకున్నాం. ఆ తరువాతే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రయత్నించాం. ఈ క్రమంలో కాంగ్రెస్​ నాయకుడు మధూయాష్కి సోదరుడు సంతోష్​ గౌడ్​ అంటూ ఒకరు వచ్చారు. 40 మంది రౌడీలతో తమ పనులు అడ్డుకోవడమే కాకుండా తమ భూమిలో ఉన్న ఫెన్సింగ్​ను బుల్డోజర్​ ద్వారా తొలగించారు. -ప్రవీణ్​​, హరిత భర్త

Next Story