హైదరాబాద్‌ టీజీఎస్‌ఆర్‌టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 14 డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు డ్రైవర్లు, కండక్టర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

హైదరాబాద్‌ టీజీఎస్‌ఆర్‌టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకం
X

దిశ, కార్వాన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 14 డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేసేందుకు డ్రైవర్లు, కండక్టర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విధులకు హాజరైన అభ్యర్థులకు ప్రతిరోజూ పని ముగిసిన వెంటనే వేతనం చెల్లించనున్నట్లు సంస్థ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప‌దో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కండక్టర్లుగా అర్హులనీ, వీరికి రోజు వారీ వేతనంగా రూ. 800 చెల్లిస్తారు. చెల్లుబాటులో ఉన్న హేవీ మోటార్ వెహికల్ లైసెన్స్‌తో పాటు, వాహనం నడపడంలో కనీసం 18 నెలల అనుభవం క‌లిగిన డ్రైవర్లకు రోజువారీ వేతనంగా రూ. 1,500 అందజేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు కాచిగూడలోని టీజీఎస్‌ఆర్‌టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. లేదా త‌మ నివాసానికి స‌మీపంలో ఉన్న బ‌ర్క‌త్ పురా, ఫ‌ల‌క్ నుమా, ఫ‌రూక్ న‌గ‌ర్, కాచిగూడ‌, మోహిదీప‌ట్నం, ముషీరాబాద్, బండ్ల‌గూడ‌, దిల్ సుఖ్ న‌గ‌ర్, హ‌య‌త్ న‌గ‌ర్ 1, హ‌య‌త్ న‌గ‌ర్ 2, ఇబ్రాహీంప‌ట్నం, మిథాని, మ‌హేశ్వ‌రం 14 డిపోల మేనేజ‌ర్ల‌ను క‌లిసి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. కండ‌క్ట‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌మ ప‌దోత‌ర‌గ‌తి ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రిగా వెంట తీసుకురావాల‌ని హైద‌రాబాద్ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ సుధా ప‌రిమ‌ళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Next Story