మహిళా కమిషన్ ఎదుట నిరసన

by Disha Web |
మహిళా కమిషన్ ఎదుట నిరసన
X

దిశ, అంబర్ పేట్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు గీతామూర్తి అన్నారు. గత నాలుగు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కల్వకుంట్ల కవిత పై చేసిన ఆరోపణలపై మహిళా కమిషన్ విచారణకు వచ్చినందున ఆయనకు మద్దతుగా గీతా మూర్తి నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున మహిళా కమిషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. బీజేపీ మహిళ నేతలతో దాదాపు గంట సేపు పోలీసులు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కల్యాణం గీతారాణి, శ్యామల, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మహిళా బీజేపీ కార్పొరేటర్లు దీపికా సురేష్, సుచిత్ర పాల్గొన్నారు.Next Story