- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HCA కేసు.. మీడియాకు పోలీసుల కీలక రిక్వెస్ట్
తెలంగాణ పోలీసు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా(Charu Sinha) మీడియాకు కీలక విజ్ఞప్తి చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీసు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా(Charu Sinha) మీడియాకు కీలక విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కేసులో దుష్ప్రచారం చేయవద్దని మీడియాకు విన్నవించారు. ఓటింగ్ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్ లపై దుష్ప్రచారం చేయొద్దని, కేసు సంబంధిత అప్‌డేట్‌లను సీఐడీ అధికారికంగా విడుదల చేస్తుందని వెల్లడించారు. ఈకేసులో అసత్య ప్రచారాలను చేయవద్దని ఓ ప్రకటన జారీ చేసారు.
HCA కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్, అధికారి రాజేందర్ యాదవ్, ఎమ్మెల్సీ కవితలపై ఆరోపణలు ఉన్నాయి.. వీరంతా 23 ఇన్‌స్టిట్యూషనల్ ఓట్లను అక్రమంగా వేయించినట్లు సీఐడీ గుర్తించింది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓటింగ్‌లో పాల్గొన్నారన్న ఆరోపణలను చారు సిన్హా తోసిపుచ్చారు.






