- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు రోజుల్లో మోకాళ్లపై మోకరిల్లిన పాకిస్తాన్ : ఎంపీలు ఈటెల, కొండా
ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైన వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి, మహిళల నుదుటిపై సింధూరం తుడిపేసిన వారిని అంతమొందించేందుకు కంకణ బద్దులై ముందుకు వచ్చి పాకిస్తాన్ ఉగ్రమూకలను అంతమొందించడం మనందరికి గర్వకారణమని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు అన్నారు.

దిశ, చైతన్యపురి : ఝాన్సీ లక్ష్మీబాయి వారసులైన వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి, మహిళల నుదుటిపై సింధూరం తుడిపేసిన వారిని అంతమొందించేందుకు కంకణ బద్దులై ముందుకు వచ్చి పాకిస్తాన్ ఉగ్రమూకలను అంతమొందించడం మనందరికి గర్వకారణమని మల్కాజిగిరి ఎంపీలు ఈటెల రాజేందర్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు అన్నారు. సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చైతన్యపురి డివిజన్ దిల్ సుఖ్ నగర్ దుర్గామాత ఆలయం నుండి నుండి ఆర్ కె పురం డివిజన్ అష్టలక్ష్మి కమాన్ వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. 25 నిమిషాల్లో 9 పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల స్టావారాలపై దాడులు చేసి మన దేశ ఘనత చాటి చెప్పామని తెలిపారు.
గతంలో దొంగచాటుగా టెర్రరిస్టు మూకలు దాడులు చేసాయని నరేంద్రమోడీ హయాంలో ఉగ్రవాదాన్ని అంత మొందించఫడానికి 356 ఆర్టికల్ రద్దు చేసి లాల్ చౌక్ పై మువ్వన్నెల జెండా ఎగరవేసి మహనీయుడు మోడీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలకు ఛాలెంజ్ చేసారని గుర్తు చేసారు. మూడు రోజులలో పాకిస్తాన్ ను మోకాళ్ళ పైన నిలబెట్టినట్లు తెలిపారు. మూడు రోజులలో ఆపరేషన్ సిందూర్ ద్వారా జవాబు చెప్పామని యుద్దానికి ఎప్పటికైనా సిద్ధమని చూపించామని పేర్కొన్నారు. మిస్సైల్ తయారు చేసిన ఘనత మన హైదరాబాద్ కు దక్కిందన్నారు. భారతజాతి ఆత్మగౌరవం కాపాడుటకు మోడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని భారత సైన్యానికి, మోడీకి మనం అందరం అండగా ఉందామని కోరారు.
నేటి యువత కూడా సైన్యంతో కలిసి పోరాడడానికి సిద్ధం ఉందన్నారు. బిజెపి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు రంగా నరసింహ గుప్త, రాధ ధీరజ్ రెడ్డి, చింతల అరుణ సురేందర్ యాదవ్, నాయికోటి పవన్ కుమార్, కొప్పుల నరసింహ రెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, వంగా మధుసూదన్ రెడ్డి, సామ రంగారెడ్డి ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు రిటైర్డ్ ఆర్మీ, నేవీ, వాయుసేన అధికారులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






