- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad: పాతబస్తీలో అధికారుల నిర్లక్ష్యం.. మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారి.. వీడియో వైరల్
హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూత లేని మ్యాన్‌హోల్ కారణంగా ఆరు ఏళ్ల బాలిక ప్రమాదానికి గురైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూత లేని మ్యాన్‌హోల్ కారణంగా ఆరు ఏళ్ల చిన్నారి ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తుండగా, మౌలా కా చిల్లా ప్రాంతంలో ఉన్న ఓపెన్ మ్యాన్‌హోల్‌లో బాలిక పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లి, స్థానికుల సహాయంతో బాలికను సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో సహాయం అందడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
ఈ ఘటనతో స్థానికులు అధికారులపై మండిపడ్డారు. ఈ మార్గంలో స్కూల్ వెళ్లే చిన్నారులు అధికంగా ఉంటారని, ఇలా మూత లేకుండా మ్యాన్‌హోల్ వదిలేయడం ఏమిటని? బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే మ్యాన్‌హోల్‌ను మూసీ వేశారు. నిర్లక్ష్యం ఎలా జరిగిందో తెలుసుకోని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.






