ఆసుపత్రిలో పాపను వదిలేసి పరారైన తల్లి.. సీసీటీవీ ఫుటేజ్‌ చెబుతున్న నిజం

by Bhanu |

అభం, శుభం తెలియని నెలల చిన్నారి పట్ల కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది. టాయిలెట్ కు వెళ్లి వస్తాను, అప్పటివరకు పాపను

ఆసుపత్రిలో పాపను వదిలేసి పరారైన తల్లి.. సీసీటీవీ ఫుటేజ్‌ చెబుతున్న నిజం
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : అభం, శుభం తెలియని నెలల చిన్నారి పట్ల కన్నతల్లి కర్కశంగా వ్యవహరించింది. టాయిలెట్ కు వెళ్లి వస్తాను, అప్పటివరకు పాపను చూస్తుండండి అంటూ అక్కడే ఉన్న మరో మహిళకు పసికందును అప్పగించి పరారైంది. ఈ సంఘటన సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ నరసింహా కథనం ప్రకారం .. శుక్రవారం ఉదయం 10.15 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి సుమారు ఎనిమిది నెలల వయస్సు గల చిన్నారిని తీసుకుని వచ్చింది.

వచ్చిన పదినిమిషాల తర్వాత పక్కనే చెకప్ కోసం వేచి ఉన్న మహిళకు చిన్నారిని ఇచ్చి తాను టాయిలెట్ వెళ్లి వస్తానని, చూస్తుండమని చెప్పి వెళ్లింది. అయితే సుమారు రెండు గంటలు గడచినా ఆమె రాకపోవడంతో తన వద్ద ఉన్న శిశువును తీసుకుని ఆస్పత్రి అధికారులను సంప్రదించింది. దీంతో వారు హాస్పిటల్ లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించగా గుర్తు తెలియని మహిళ తన బిడ్డను వదిలేసి అక్కడి నుండి పారిపోయినట్లుగా గుర్తించారు .

ఈ మేరకు హాస్పిటల్ అధికారులు సుల్తాన్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై వేణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . సదరు శిశువు లేదా తల్లి గురించి తెలిసిన వారు వెంటనే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story