ఒమిక్రాన్‌ విషయంలో టెన్షన్ అవసరం లేదు: ఎమ్మెల్యే గాంధీ

by Web Desk |
ఒమిక్రాన్‌ విషయంలో టెన్షన్ అవసరం లేదు: ఎమ్మెల్యే గాంధీ
X

దిశ, శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో జరిగిన ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని ఏఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ రోజాదేవి రంగరావులతో కలిసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదంతో ముందుకు వెళుతుందన్నారు. ప్రతీ ఇంటికెళ్లి వైద్యారోగ్య సిబ్బంది ఫీవర్ పరీక్షలు చేస్తున్నారని, కరోనా లక్షణాలున్న వారికి హోం ఐసోలేషన్ కిట్లు అందజేస్తున్నారన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని, టీకానే శ్రీరామ రక్ష అని గాంధీ అన్నారు. ఫీవర్ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని, ఒమిక్రాన్‌ విషయంలో ఎటువంటి భయం వద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్పీ వినయ్ కాంత్ రెడ్డి, సీఓ సుజాత, ఆర్పీలు కవిత, సరితా, భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story