ఫిబ్ర‌వ‌రి 12న సార్వ‌త్రిక స‌మ్మెను విజ‌య‌వంతం చేయండి

by Ratna Kumari |

అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కు లెఫ్ట్ పార్టీల నాయకులు సమ్మె నోటీసు అందజేశారు.

ఫిబ్ర‌వ‌రి 12న సార్వ‌త్రిక స‌మ్మెను విజ‌య‌వంతం చేయండి
X

దిశ‌, శేరిలింగంప‌ల్లి : అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కు లెఫ్ట్ పార్టీల నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ కార్యదర్శి కొంగరి కృష్ణ, ఏఐటీయూసీ కార్యదర్శి చందు యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో జీహెచ్ఎంసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మె జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకురావడం జరిగిందని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు ఏకమై సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. ఆనాడు ఎన్నికల్లోజీహెచ్ఎంసీ కార్మికులను కనీస వేతనాలు అమలు చేస్తామని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేస్తామని, డబల్ బెడ్ రూమ్ లు కార్మికులకు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరగబోయే సమ్మెలో కార్మికులందరూ అత్యధికంగా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరావు, కొండలు, శ్రీను పాల్గొన్నారు.

Next Story