Maganti Gopinath : మాగంటి పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు

by Muthe.Rajitha |

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపినాథ్(Maganti Gopinath) నేడు ఉదయం 5:45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Maganti Gopinath : మాగంటి పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపినాథ్(Maganti Gopinath) నేడు ఉదయం 5:45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. మాగంటి భౌతిక దేహానికి కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) సహ ఆ పార్టీ నేతలంతా అంజలి ఘటించారు. ఆయన అంతిమయాత్ర కొద్దిసేపటిక్రితమే ప్రారంభం అయింది. ఈ అంతిమయాత్ర ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగనుంది.. మాగంటి గోపినాథ్ భౌతికకాయాన్ని మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ర్యాలీగా తీసుకెళ్లారు.

ఈ యాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాడె మోసారు. అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Next Story