- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponnam Prabhakar : మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకోవాలి : మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్MLA (Maganti Gopinath) తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్MLA (Maganti Gopinath) తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపీనాథ్ అనారోగ్యంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పందించారు. నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మంత్రిగా ఆయనను అనేకసార్లు కలిశానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందని, అయితే ప్రభుత్వ కార్యక్రమాల బిజీ షెడ్యూల్ తో ఆయనను పరమర్శించడానికి ఆసుపత్రికి వెళ్లలేకపోయినట్టు తెలిపారు.
ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని, బీఆర్ఎస్ నాయకులు మాత్రం మాగంటి అనారోగ్యాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. బోరబండలో బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఆత్మహత్యను కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసియుద్దీన్‌కు ఆపాదిస్తూ బీఆర్ఎస్ నాయకులు కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. సర్దార్ మరణంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.






