కేసీఆర్​, హరీష్​ రావులు తుపాకీ రాములు.. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ

by Disha Web Desk 20 |
కేసీఆర్​, హరీష్​ రావులు తుపాకీ రాములు.. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ
X

దిశ, చార్మినార్​ : బీఆర్​ఎస్​ మెనిఫెస్టోలో న్యాయవాదుల సమస్యలు పొందపరచకపోవడంతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ భగ్గుమన్నారు. సోమవారం హైకోర్టు 6వ నెంబర్​ గేట్​ వద్ద తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ మెనిఫెస్టో ప్రతులను చింపి వేసి తన నిరసన వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ న్యాయవాదులు మాట్లాడుతూ బీఆర్​ఎస్​ పార్టీ మెనిఫెస్టోలో అన్ని వర్గాలకు స్వర్గం చూపిస్తాం.. మా మెనిఫెస్టో వస్తే అందరు అవాక్కయితరు.. చెవాక్కయితరు అని సీఎం కేసీఆర్​, మంత్రి హరీష్​ రావులు తుపాకీ రాముని మాటలు పేల్చారని మండి పడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామిలు నెరవేర్చకపోగా 50వేల కు పైగా ఉన్నటువంటి న్యాయవాదుల సమస్యలను మెనిఫెస్టోలో పొందపరచకుండా న్యాయ వాదులకు తీరని అన్యాయం చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల అభ్యన్నతికి 1‌‌00 కోట్లు ఇచ్చామని పాల ప్యాకెట్​లతో అభిషేకాలు చేసుకున్నటువంటి బీఆర్​ ఎస్​ ప్రభుత్వం ప్రస్తుతం ఆ 100 కోట్లను నాకేసిందని దుయ్యబట్టారు.

ఆ వంద కోట్లు ఏమయ్యాయని అడ్వికేట్​ జనరల్​ ను అడిగినా కానీ డబ్బులు లేవు ప్రభుత్వాన్ని అడగండి అంటున్నారని, అడీషనల్​ అడ్వికేట్​ను అడిగినా తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారన్నారు. ఎన్ని రోజులు ప్రజలను ఇంకా మోసం చేస్తారని, అటు నిరుద్యోగులను, ముడు ఎకరాల స్థలం ఇస్తానని దళితులను ఇంకా ఎంతమందిని మోసం చేస్తారని ప్రశ్నించారు. న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ మోసకారి మాటలను చెప్పిన బీఆర్​ఎస్ ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని, న్యాయవాదులకు అన్యాయం చేస్తున్న బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించేలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అన్ని పార్టీలు కూడా ఎనికల మెనిఫెస్టోలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని పొందపరచాలని డిమాండ్​ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్​ బర్ల మల్లేష్ యాదవ్, జనార్దన్ గౌడ్, పొలాస శంకర్, నర్సింగ్, భరత్, ఆకర్ష్, సాయితేజ, నరేష్, శ్రీకాంత్, వీర, భైరవ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed