- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ఫినాయిల్ తో నోరు కడుక్కోవాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫినాయిల్ తో నోరు కడుక్కోవాలని.. బీఆర్ఎస్ నాయకులను పాత చెప్పుతో కొట్టినా పాపం పోదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ధ్వజమెత్తారు.

దిశ, కార్వాన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫినాయిల్ తో నోరు కడుక్కోవాలని.. బీఆర్ఎస్ నాయకులను పాత చెప్పుతో కొట్టినా పాపం పోదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ధ్వజమెత్తారు. గురువారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని.. లేదంటే ప్రజలే తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. కేటీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయన వెంటనే ఫినాయిల్‌తో నోరు కడుక్కోవాలని ఎద్దేవా చేశారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు రైతులను తీవ్రంగా గోస పెట్టించారని.. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.
ముఖ్యంగా పంజాబ్ కి వెళ్లి అక్కడి రైతులకు చెక్కులు పంపిణీ చేయడం తెలంగాణ రైతులను అవమానించడమేనని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను పాత చెప్పుతో కొట్టినా వారు చేసిన పాపం పోదు" అంటూ సాయికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ తన చుట్టూ నలుగురు చిల్లర గాళ్లను, పది మంది భజన పరులను వేసుకొని తిరుగుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని మెట్టు సాయికుమార్ హెచ్చరించారు.






