- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyd: పాడి కౌశిక్ రెడ్డికి విచారణ .. స్టేట్ మెంట్ రికార్డు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డికి విచారణ కొనసాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి(Brs Mla Padi Koushik Reddy)కి విచారణ ముగిసింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై ఆభియోగాలున్నాయి. ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ మాసబ్ ట్యాంకు(Masab Tank) పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు ఆయన్ను ప్రశ్నించారు.. విచారణ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు.
విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తనను పోలీసులు 32 ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు ఆయన చెప్పారు. తనపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై తాను ప్రశ్నించడంతోనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని కౌశిక్ రెడ్డి సూచించారు.






