అంత‌ర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. 17 తులాల బంగారం స్వాధీనం

by Ratna Kumari |

బ‌స్సులో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌ను టార్గెట్ చేసుకొని దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన అంత‌ర్రాష్ట్ర దొంగ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌ని వ‌ద్ద 17 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అంత‌ర్రాష్ట్ర దొంగ అరెస్ట్..  17 తులాల బంగారం స్వాధీనం
X

దిశ‌, కార్వాన్ : బ‌స్సులో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌ను టార్గెట్ చేసుకొని దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన అంత‌ర్రాష్ట్ర దొంగ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌ని వ‌ద్ద 17 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న అప్జ‌ల్ గంజ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం గోల్కొండ జోన్ డీసీపీ చంద్ర మోహ‌న్ త‌న కార్యాల‌యంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. హైద‌రాబాద్ లోని కొండాపూర్ కి చెందిన డీ.ఎస్. కీర్త‌న ఈనెల 12న రాత్రి అనంత‌పురం నుంచి హైద‌రాబాద్ కి మీనా ట్రావెల్స్ బ‌స్సులో బ‌య‌లుదేరారు. మ‌రుస‌టి రోజు ఆమె హైద‌రాబాద్ చేరుకున్నాక త‌న బ్యాగ్ ను త‌నిఖీ చేయ‌గా.. బ్యాగ్ లో ఉన్న సుమారు 20 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు (లాంగ్ హారం, మంగ‌ళ‌సూత్రం, బంగారు గొలుసు, గాజులు, ఉంగ‌రాలు) చోరీకి గురైన‌ట్టు గుర్తించింది. వెంట‌నే బాధితురాలు అప్జ‌ల్ గంజ్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది.


పోలీసులు కేసు న‌మోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా క‌ర్నూలు జిల్లా బుధ‌వార‌పేట‌కు చెందిన అన్నారెడ్డి వెంక‌ట శివారెడ్డి(35)గా గుర్తించారు పోలీసులు. నిందితుడు ఓ సూప‌ర్ మార్కెట్ లో ప‌ని చేసేవాడు. జూదం, చెడు వ్య‌స‌నాల‌కు బానిసై సుల‌భంగా డ‌బ్బులు సంపాదించేందుకు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ నిందితుడి పై ప‌లు కేసులు అయిన‌ట్టు బ‌స్సులో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు నిద్రిస్తున్న స‌మ‌యంలో వారి బ్యాగ్ ల‌ను త‌నిఖీ చేసి దొంగ‌త‌నం చేసేవాడ‌ని డీసీపీ పేర్కొన్నారు. ఈ ఆప‌రేష‌న్ లో అఫ్జ‌ల్ గంజ్ ఎస్ హెచ్ఓ ఎన్. మోహ‌న్ రావు, డిటెక్టివ్ ఇన్ స్పెక్ట‌ర్ బి. ర‌వి కిర‌ణ్, డీఎస్ఐ న‌రేంద‌ర్ రెడ్డి, సిబ్బంది జితేంద‌ర్, జి. శ్రీకాంత్, మ‌ధుసూన్, శ్రీకాంత్ బిడ్లా, ఎస్. ప్రియాంక‌, కె. శివానిని డీసీపీ అభినందించి ప్ర‌త్యేక రివార్డుల‌ను ప్ర‌క‌టించారు.

Next Story