ఇంట‌ర్ ఫెయిల్.. ఏడాదిగా డాక్ట‌ర్ గా చ‌లామ‌ణి..!

by Ratna Kumari |

తక్కువ సమయంలో భారీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో నకిలీ డాక్టర్ అవతారమెత్తిన ఓ వ్యక్తిని శనివారం వారాసిగూడ పోలీసులు అరెస్టు చేశారు.

ఇంట‌ర్ ఫెయిల్.. ఏడాదిగా డాక్ట‌ర్ గా చ‌లామ‌ణి..!
X

దిశ, సిటీక్రైం : తక్కువ సమయంలో భారీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో నకిలీ డాక్టర్ అవతారమెత్తిన ఓ వ్యక్తిని శనివారం వారాసిగూడ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..భూపాలపల్లి గ్రామానికి చెందిన నన్నుట మాధవ్(42) హైదరాబాద్ కు వలస వచ్చి వారాసిగూడ ప్రాంతంలో మాధవ మెడికల్ షాపు ను నిర్వహిస్తున్నాడు. దీని కోసం తన స్నేహితురాలు కుంట అర్చన డ్రగ్ లైసెన్స్ ను అక్రమంగా ఉపయోగించాడు. ఈ లైసెన్స్ ద్వారా మెడికల్ షాపును నిర్వహిస్తూ నకిలీ డాక్టర్ గా ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న వారాసిగూడ పోలీసులు డెకాయ్ అపరేషన్ ను నిర్వహించి ఓ హెడ్ కానిస్టెబుల్ అతని వద్ద కు రోగిగా వెళ్ళాడు.

ఆ సమయంలో అవగాహన లేకుండా ఇంజక్షన్ ను చేస్తున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి నకిలీ డాక్టర్ మోసాన్ని రెడ్ హ్యాండెడ్ గా బయటపెట్టారు. విచారణలో తాను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానని, డబ్బులు సంపాదించాలనే దురాశతో నకలీ డాక్టర్ గా చలామణీ అవుతున్నానని చెప్పాడు. ఏడాదిగా ఇలా మాధవ్ నకిలీ డాక్టర్ గా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని తెలుసుకుని పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతని నుంచి డైక్లోఫెనాక్ తో పాటు టీటీ ఇంజక్షన్ లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు నకలీ వైద్యులతో అప్రమత్తంగా ఉండాలని అర్హతలు ఉన్న డాక్టర్ ల వద్దకే వైద్యానికి వెల్లాల‌ని, నకిలీ డాక్టర్ ల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చకోవద్దని సూచించారు.

Next Story