- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉంటే పార్టీ కండువాతో తెలంగాణ భవన్ కి రావాలి
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నట్టయితే ఈనెల 21న కేసీఆర్ అధ్యక్షతన

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నట్టయితే ఈనెల 21న కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి బీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాలని ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, సామ వెంకట్ రెడ్డి, రవీందర్ యాదవ్, కలిదిండి రోజ, మల్లారెడ్డి, సంగారెడ్డి, వాలా హరీష్ రావు, గోకరాజు శ్రీనివాస్, ఎర్రబెల్లి సతీష్ రావులు డిమాండ్ చేశారు. గురువారం చందానగర్ లో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిదని, స్వయంగా ఎమ్మెల్యేలే తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని మీడియాకు తెలిపారని, అయినా స్పీకర్ మాత్రం పార్టీ మారలేదని చెప్పడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం.. వారిపై అనర్హత వేటు పడకుండా ఆపారు. కానీ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం అయింది.
మా తరుపున, ప్రజల తరపున వాటిపై పోరాటం చేద్దాం రండి అని బీఆర్ ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మీ అక్రమాలను కప్పి పుచ్చుకోడానికి, మీ అనుచరులను కాపాడడానికి పార్టీ మారావని ప్రజలకు తెలుసు అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. గాజుల రామారం భూమి విషయంలో స్వయంగా విజిలెన్స్ దర్యాప్తు కోరుతూ లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పై అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టారీతిగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. దమ్ముంటే కారు గుర్తు మీద గెలిచిన మీరు వెంటనే రాజీనామా చేసి, ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అంతా ఏకతాటిపై ఉందని, ఎమ్మెల్యే అరికపూడి గాంధీని అడుగు అడుగున అడ్డుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.






