- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులకు నో ట్రాఫిక్ రూల్స్..
సామాన్య వాహనదారుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి చల్లాన్ లు పెండింగ్ లో ఉంటే ట్రాఫిక్ పోలీసులు చేసే హడావిడి, హంగామా, వారి మాటలు, వారి ప్రవర్తన ఏలా ఉంటుంది.

దిశ, సిటీక్రైం : సామాన్య వాహనదారుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి చల్లాన్ లు పెండింగ్ లో ఉంటే ట్రాఫిక్ పోలీసులు చేసే హడావిడి, హంగామా, వారి మాటలు, వారి ప్రవర్తన ఏలా ఉంటుంది. ఆ చల్లాన్ లను కట్టే వరకు వాహనం వదలకపోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో వాహనాన్ని జప్తు చేస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు భయపెట్టే మాటలు వణికించేస్తాయి. అలా ట్రాఫిక్ రూల్స్ ను కచ్చితంగా అమలు చేస్తున్నామంటూ చెప్పే అధికారులు , సిబ్బంది సామాన్యులకు ఉల్లంఘనలను చూపించి చెమటలు పట్టించేస్తారు. ఇలాంటి ద్రుశ్యాలతో పాటు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ఉల్లంఘనలు, రాంగ్ పార్కింగ్ వంటి అంశాలను చూసిన ట్రాఫిక్ అవేర్ నెస్ అడ్వకేట్ లోకేందర్ సింగ్ ఆర్ టీఐ ద్వారా ప్రశ్నించిన సమాధానానికి షాకింగ్ జవాబు పోలీసుల నుంచి రాతపూర్వకంగా అందింది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు వాహనాలు ఉల్లంఘనల పై ఎన్ని చల్లాన్ లు పెండింగ్ తో ఉన్నాయని, వాటి రుసుము ఎంత ఉందని ప్రశ్నిస్తే ....ఆర్ టిఐ యాక్ట్ కింద పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం...హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు వాహనాల ఉల్లంఘనల పై జారీ చేసిన చల్లాన్ లలో దాదాపు 17,391 చల్లాన్ పెండింగ్ లో ఉన్నాయి. 68.67 లక్ల రూపాయాలను చల్లాన్ ల రూపంలో చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పాదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాల్సిన పోలీసులు వారి పెండింగ్ చల్లాన్ లపై ఏలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం సామాన్య ప్రజల పై వారి అధికార పెత్తనాన్ని చూపించడం కరెక్ట్ కాదని ట్రాఫిక్ అవేర్ నస్ అడ్వకేట్ లోకేందర్ సింగ్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని నిరంతరం ప్రజలను అప్రమత్తం చేసే ట్రాఫిక్ పోలీసులు ముందుగా ఉల్లంఘనలు చేయకుండా, పెండింగ్ చలాన్ లను చెల్లించి వారు ఆదర్శంగా ఉండాలని లోకేందర్ సింగ్ స్పష్టం చేశారు.






