- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
by Naga Rani Yarlagadda |
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో నగరం నలుమూలల నుంచి గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో నగరం నలుమూలల నుంచి భక్తులు ఖైరతాబాద్ కు క్యూ కట్టారు. ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రోల్లోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలైన్ ఉండగా.. ఆన్లైన్ టికెట్లు కూడా బుక్ అవ్వక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు మూడు క్యూలైన్లలో వెళ్తున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. కాగా.. ఈ నెల 7న చంద్రగ్రహణం ఉండటంతో 6వ తేదీనే మహాగణపతిని నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది.
Next Story






