- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ వ్యర్థాల బెడద పెరిగిపోయింది. జీహెచ్ఎంసీ నుంచి భవన నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మాణ సమయంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను చెరువులు, రోడ్ల పక్కన, నాలాల్లో పడేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్ మెంట్ కసరత్తు చేస్తోంది. బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పర్మిషన్ ఆధారంగా వ్యర్థాల తరలింపుపై ఫోకస్ చేయనుంది.
భవనానికి ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ జారీచేయాలంటే అనుమతి తీసుకున్నప్పటి నుంచి బిల్డింగ్ పూర్తయ్యే వరకు ఉత్పత్తి అయిన నిర్మాణ వ్యర్థాలను కన్‌స్ట్రక్చన్ అండ్ డెమోలిషన్ ( సీ అండ్ డీ) వేస్ట్ ప్లాంట్‌కు తరలించినట్టు సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయడానికి అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీంతోపాటు ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు, రోడ్ల మరమత్తులు, ఇతర కాంట్రాక్టుల్లోనూ ఈ నిబంధనను చేర్చాలని భావిస్తున్నారు. ఈ నిర్మాణ వ్యర్థాలను సైతం సీ అండ్ డీ ప్లాంట్ తరలించడంతోపాటు అక్కడి నుంచి సర్టిఫికెట్ ఇస్తేనే బిల్లులు చెల్లించేవిధంగా నిబంధన తీసుకురావాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే జారీచేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.






