- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court : అక్రమ నిర్మాణాలపై హైకోర్ట్ ఆగ్రహం
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న అక్రమ నిర్మాణాల(Illegal Constructures)పై హైకోర్ట్(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న అక్రమ నిర్మాణాల(Illegal Constructures)పై హైకోర్ట్(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారంటూ మున్సిపల్ అధికారుల(Muncipal Officers)పై తీవ్రంగా మండిపడింది. అంత పెద్ద భవనాలు కడుతుంటే మీరంతా కళ్ళు మూసుకొని తిరుగుతున్నారా అంటూ అధికారులను నిలదీసింది. కాగా శేరిలింగంపల్లిలోని ఓ భవన నిర్మాణదారుని పిటిషన్ పై హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. 'కోర్టు ఆదేశాలు జారీ చేశాక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు.
ఈలోగా అక్కడ నిర్మాణాలు పూర్తి అవుతాయి. ఇక అపుడు కూల్చివేతల పేరుతో మరో డ్రామా చేస్తారు. ప్రాంతాల వారీగా అధికారులున్నా ఇన్నేసి అక్రమ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి. వాటి గురించి మీకు ఎలాంటి సమాచారం ఉండదా? పన్నులు వసూలు చేసేపుడు మాత్రం ఆ భవనం వివరాలు పూర్తిగా తెలుస్తాయి" అంటూ తీవ్రంగా స్పందించింది.






