HYDRAA : హైదరాబాద్ లో భారీ వర్షం.. పౌరులకు హైడ్రా హై అలర్ట్ మెసేజులు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-18 11:04:12  IST  )

హైదరాబాద్(Hyderabad Rains) నగరంలో భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.

HYDRAA : హైదరాబాద్ లో భారీ వర్షం.. పౌరులకు హైడ్రా హై అలర్ట్ మెసేజులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad Rains) నగరంలో భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములు, మెరుపులతో అనేక ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. ఈ నేపథ్యంలో నగర పౌరులకు హైడ్రా(HYDRAA) హై అలర్ట్ మెసేజెస్(High Alerts) పంపింది. GHMC తోపాటు, ORR వరకు గల అనేక చోట్ల కుండపోత వాన పడే అవకాశం ఉందని, హైడ్రా కమిషనర్ రంగనాథ్(Comissionor Ranganath) పేరిట మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సమాచారం పంపించారు. బయటికి వెళ్లేముందు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకి వెళ్లారాదని సూచించింది.

కాగా అమీర్ పేట , ఖైరతాబాద్, యూసఫ్ గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, కొత్తపేట, రాజేంద్ర నగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం మరో గంటపాటు ఇలాగే కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) పేర్కొంది. అయితే భారీ వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచి, భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Next Story