- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గణేష్ శోభాయాత్ర విజయవంతం : సీపీ సీవీ ఆనంద్
11 రోజుల్లో హైదరాబాద్ లో 1.40 లక్షల విగ్రహాలు నిమజ్జనం

గణేష్ శోభాయాత్ర విజయవంతం : సీపీ సీవీ ఆనంద్
- సిటీ ప్రజలకు థ్యాంక్స్
- 11 రోజుల్లో హైదరాబాద్ లో 1.40 లక్షల విగ్రహాలు నిమజ్జనం
- 170 మంది పోకిరీలు అరెస్టు
దిశ, సిటీ క్రైమ్ : హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్రను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగించామని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆదివారం తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, నగర ప్రజల సహకారం, గణేష్ ఉత్సవ సమితులు, మండప నిర్వాహకులు, జీహెచ్ఎంసి, ఇతర శాఖల సమన్వయంతో 40 గంటలపాటు సాగిన నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశామని పేర్కొన్నారు. 11 రోజులలో నగరంలోని చిన్న చెరువులు, ట్యాంక్ బండ్, తాత్కాలిక కొలనులలో కలిపి 1.40 లక్షల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయినట్లు వివరించారు. ఇందులో చివరి రోజే 4,700 విగ్రహాలు, అంతకు ముందే 7,330 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు. పోలీసులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 12,030 మండపాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. “48 గంటలు నిద్ర లేకుండా విధుల్లో పనిచేసిన పోలీసుల కృషితో ఈ శోభాయాత్ర విజయవంతమైంది” అని అభినందించారు.
170 మంది అరెస్టు
శోభాయాత్ర సందర్భంగా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన 170 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పిక్ పాకెటర్లను అదుపులోకి తీసుకున్నామని, చిన్న చిన్న సంఘటనలపై ఐదు కేసులు నమోదు చేశామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గాయని స్పష్టం చేశారు.






