- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హయత్‌నగర్‌లో అగ్ని ప్రమాదం
by Ratna Kumari |
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వనస్థలిపురం : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జయశ్రీ ఎలక్ట్రానిక్స్ షాప్, లక్ష్మీనరసింహ కార్ డెకార్స్, ఓ ఫర్నిచర్ దుకాణం సమీపంలోని మరికొన్ని షాపుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే హయత్‌నగర్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా వ్యాపిస్తున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో జయశ్రీ ఎలక్ట్రానిక్స్ షాప్, ఫర్నిచర్ షాపులకు ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కాస్త ఊరటనిచ్చింది. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా నియంత్రించగలిగారు.
Next Story






