- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దాగున్న 'గంజాయి' కథ..
విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి డబ్బులు సరిపోకపోవడంతో ఓ ఫాస్ట్ ఫుడ్ కేంద్రం నిర్వాహకుడు ఒడిశా నుంచి సికింద్రాబాద్ కు గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు.

దిశ, సిటీక్రైం : విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి డబ్బులు సరిపోకపోవడంతో ఓ ఫాస్ట్ ఫుడ్ కేంద్రం నిర్వాహకుడు ఒడిశా నుంచి సికింద్రాబాద్ కు గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అతనిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశా దిమిరి గూడ ప్రాంతానికి చెందిన సునిల్ బిన్ ధాని ఫాస్ట్ ఫుడ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. కరోనా సమయంలో తమిళనాడు, మహారాష్ట్రలో కాటన్ మిల్ లో పని చేశాడు. సునిల్ విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి దందాను చేయడానికి శ్రీకారం చుట్టాడు. దీని కోసం ఒడిశా నుంచి గంజాయిని కొనుగొలు చేసి రైలు లో సికింద్రాబాద్ కు వచ్చి రాణిగంజ్ ప్రాంతంలో విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.






