- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేం భక్షక భటులం.. రౌడీషీటర్ల నయా దందా..
మేము పోలీస్ అంటూ స్పా కేంద్రాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను రౌడీషీటర్ అతని అనుచురుడు బెదిరిస్తూ డబ్బులను వసూలు చేస్తున్న బాగోతాన్ని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.

దిశ, సిటీక్రైం : మేము పోలీస్ అంటూ స్పా కేంద్రాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను రౌడీషీటర్ అతని అనుచురుడు బెదిరిస్తూ డబ్బులను వసూలు చేస్తున్న బాగోతాన్ని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జహునామా, శాలిబండ ప్రాంతానికి చెందిన ఫయాజ్ , సయ్యద్ అహ్మాద్ హాష్మి లు స్నేహితులు. వీరిలో సయ్యద్ అహ్మాద్ హాష్మి శాలిబండ పీఎస్ లో రౌడీషీటర్ గా నమోదయ్యాడు. ఈ ఇద్దరు డబ్బులు సంపాదించేందుకు నకిలీ పోలీసులు గా అవతారమెత్తారు.
ఇలా తాము టాస్క్ ఫోర్స్, సీసీఎస్, ఎస్ఓటీ పోలీసులమంటూ స్పా కేంద్రాలను నిర్వహిస్తున్న వారిని బెదిరిస్తున్నారు. ఫిలింనగర్, పంజాగుట్ట, మాదాపూర్ , మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లోని స్పా కేంద్రాలకు వెళ్ళి వీరు పోలీసులమంటూ బెదిరిస్తు నిర్వాహకుల వద్ద నుంచి రూ. 50 వేల నుంచి 60వేల వరకు వసూలు చేసి అక్కడి నుంచి పారిపోతున్నారు. వీరి బెదిరింపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం ఈ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో బెదిరింపులు నిజమేనని తేలింది. ఆధారాలు సేకరించి వీరిని అరెస్టు చేశారు.






