- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేక్ సర్టిఫికేట్ దందాలో ట్యూషన్ టీచర్...
చదువుల్లో ఫెయిల్ అయ్యాడు. కాని విద్యార్ధులకు ట్యూషన్ లు చెప్పుతు జీవనం సాగిస్తున్నాడు. ఈ ముసుగులో చదువుకోకుండా పరీక్షలు రాయకుండా డిగ్రి , బీటెక్ సర్టిఫికెట్ లను పొందాలనుకున్న వారికి ఫేక్ సర్టిఫికెట్ లను ఇప్పిస్తున్న ట్యూషన్ టీచర్ గుట్టును బుధవారం హైదరాబాద్ సౌత్-ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు.

దిశ, సిటీక్రైం : చదువుల్లో ఫెయిల్ అయ్యాడు. కాని విద్యార్ధులకు ట్యూషన్ లు చెప్పుతు జీవనం సాగిస్తున్నాడు. ఈ ముసుగులో చదువుకోకుండా పరీక్షలు రాయకుండా డిగ్రి , బీటెక్ సర్టిఫికెట్ లను పొందాలనుకున్న వారికి ఫేక్ సర్టిఫికెట్ లను ఇప్పిస్తున్న ట్యూషన్ టీచర్ గుట్టును బుధవారం హైదరాబాద్ సౌత్-ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. 36 ఫేక్ సర్టిఫికేట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన విషయాల ప్రకారం...హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాదర్ 2016 సంవత్సరంలో బీటెక్ విద్యను మధ్యలో వదిలేశాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్ళేందుకు ప్రయత్నించాడు. అయితే కచ్చితంగా బీటెక్ ఉత్తీర్ణత లేదా డిగ్రి సర్టిఫికేట్ ఉండాలని తెలుసుకుని తలాబ్ కట్టా ప్రాంతానికి చెందిన ట్యూషన్ టీచర్ సయ్యద్ ఇమ్రాన్ ను సంప్రదించాడు. దీంతో అతను రూ 80 వేల రూపాయాలు తీసుకుని బుందేల్ ఖండ్ యూనివర్సిటీ కి చెందిన ఓ ఫేక్ సర్టిఫికేట్ ను తెప్పించి ఇచ్చాడు. ఈ సర్టిఫికేట్ ను మసాబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్క్ వద్ద ఇస్తుండగా ట్యూషన్ టీచర్ సయ్యద్ ఇమ్రాన్, మహ్మాద్ ఖాదర్ లను అరెస్టు చేశారు. విచారణలో సయ్యద్ ఇమ్రాన్ నుంచి మరో 36 సర్టిఫికేట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో సయ్యద్ ఇమ్రాన్ ఢిల్లీకి చెందిన రోషన్ ద్వారా బుందేల్ ఖండ్ యూనివర్సిటీకి చెందిన సర్టిఫికేట్ లను నకిలీగా తయారు చేసి వాటిని రూ. 80 వేలకు అమ్ముతున్నారని పోలీసులు తెలుసుకున్నారు. రోషన్ కు 50 వేలు ఇచ్చి 30 వేల రూపాయాలను సయ్యద్ ఇమ్రాన్ తీసుకుంటున్నాడని తెలిసింది. రోషన్ కూడా బుందేల్ ఖండ్ యూనివర్సిటీకి చెందిన ఖాళీ సర్టిఫికేట్ లను తీసుకుని వాటిపై మార్కులను ఇతర వివరాలను ప్రింట్ చేసి అచ్చం ఆ యూనివర్సిటీకి చెందిన సర్టిఫికేట్ గా తయారు చేసి వాటిని అమ్మేస్తున్నారని పోలీసులు ప్రాధమికంగా కొంత సమాచారం సేకరించారు.
ఈ సర్టిఫికేట్ లను పొందిన వారు ప్రైవేట్ కంపెనిలు, ఇతర కార్పోరేట్ సంస్థల్లో ఉద్యగాలు దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటి వెరిఫికేషన్ కోసం ఎవరైనా ప్రయత్నించడానికి సర్టిఫికేట్ ఫోటోతో పాటు, వివరాలను మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు యూనివర్సిటీలో ఉండే రోషన్ మనుషులు ఆ మెయిల్ కు ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ అంటూ రిప్లై ఇచ్చి బురిడి కొట్టిస్తారని వెలుగులోకి వచ్చింది. ఇలా చాలా మంది ఈ నకిలీ సర్టిఫికేట్ లతో ప్రైవేట్ సంస్థలతో పాటు దుబాయ్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఉద్యోగాలు పొందారని పోలీసులు గుర్తించారు. రెండు రోజులలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 144 ఫేక్ సర్టిఫికేట్ లను స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్టు చేశారు. సర్టిఫికేట్ లను తయారు చేస్తున్న ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రధాన సూత్రధారులు పరారీలో ఉన్నారు. వాట్సాప్ లో ఆధార్ కార్డును పంపిస్తే చాలు సర్టిఫికేట్ పై మీకు కావాల్సిన మార్కులు, వివరాలు రెడి అయ్యిపోయి కొరియర్ లో సర్టిఫికేట్ లు చేతికి అందుతున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది.






