- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘం కోరింది.

దిశ, హిమాయత్ నగర్ : చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘం కోరింది. ఈ మేరకు మంగళ వారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బి. సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకే ఏకలవ్య ఎరుకల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎరుకలను విస్మరించిందన్నారు. గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 12 ఏళ్లుగా ట్రైకార్ చైర్మన్ పదవీని లంబాడీల సామాజిక వర్గానికి పరిమితం చేశారని, ఈసారి ఎరుకల సామాజిక వర్గానికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఎరుకల విద్యార్థులు నివసించడానికి ఒక హాస్టల్ నిర్మించాలని, విదేశాలలో చదువుకోవడానికి ఇచ్చే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఎరుకల యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కెంసారం ఎల్లయ్య, సీనియర్ నాయకులు శ్రీరాం శివ కుమార్, రమేష్, సత్యనారాయణ, శేఖర్, సుధాకర్, కృష్ణ, రవి మహిళా నాయకులు శ్యామల పాల్గొన్నారు.






