ఐటీ ఉద్యోగుల పేరుతో న‌డుస్తున్న డ్ర‌గ్స్ దందా..!

by Ratna Kumari |

హయత్‌నగర్‌లో ఐటీ ఉద్యోగుల పేరుతో నడుస్తున్న డ్రగ్స్ దందాను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందం బట్ట బయలు చేసింది.

ఐటీ ఉద్యోగుల పేరుతో న‌డుస్తున్న డ్ర‌గ్స్ దందా..!
X

దిశ, వనస్థలిపురం : హయత్‌నగర్‌లో ఐటీ ఉద్యోగుల పేరుతో నడుస్తున్న డ్రగ్స్ దందాను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందం బట్ట బయలు చేసింది. ఈ కేసులో ముగ్గురు సాప్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి 7.44 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన అంజద్ అనే సాప్ట్ వేర్ ఉద్యోగి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించేందుకు హేమంత్ అనే మరో ఐటీ ఉద్యోగి పెట్టుబడి పెట్టగా.. వాటిని హరీష్ అనే వ్యక్తి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన సమయంలో టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకుంది.


బెంగళూరులో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఎండీఎంఏను హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు విచారణలో తేలింది. ఈ ఆపరేషన్‌లో ఎస్టీఎఫ్ బీ టీం సీఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన నిందితులను హయత్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు బీ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story