హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించిన డీఆర్ఎఫ్ సిబ్బంది.. నిలిచిపోయిన అత్యవసర సేవలు

by Malleboina Mahesh |

బుధవారం ఉదయం డీఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించారు. జీతాలు తగ్గించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేస్తున్నారు.

హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించిన డీఆర్ఎఫ్ సిబ్బంది.. నిలిచిపోయిన అత్యవసర సేవలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజధాని నగరంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (Hydraa) వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. మొన్నటి వరకు పేదల ఇళ్లనే లక్ష్యంగా చేస్తుందనే విమర్శలు ఎదుర్కొన్న హైడ్రా.. తాజాగా సొంత కార్మికులకు సరైన జీతాలు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం డీఆర్ఎఫ్ సిబ్బంది (DRF staff) హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించారు. జీతాలు తగ్గించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డీఆర్ఎఫ్ బృందాలు విధులను బాయ్ కట్ (Boy cut) చేసి ఆందోళన (protest)కు దిగారు. ఈ క్రమంలో నెక్లెస్ రోడ్డులో ఉన్న హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించిన (Hydra office Siege) డీఆర్ఎఫ్ బృందాలు.. తమకు న్యాయం జరగకపోతే విధులకు హాజరుకామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా అత్యవసర సేవలు (Hydra Emergency Services) ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి.

Next Story